చంద్రగ్రహణం సందర్భంగా మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో మంగళవారం ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని స్టేషన్ రోడ్డులో కొందరు వ్యక్తులు చంద్రగ్రహణం సమయంలో రోలులో రోకలిని నిటారుగా నిలబెట్టారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో రోకలిబండ రోడ్డులో నిటారుగా నిలబడుతుందని ప్రజలకు తెలుసు. అయితే, ఈ వింతను చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా తిలకించారు.