కొమరోలు పట్టణంలోని సినిమా హాలు సమీపంలో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ప్రేమ జంట 8 నెలల క్రితం వివాహం చేసుకొని కొమరోలులో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల నడుమ మనస్పర్ధలు కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆది బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని గిద్దలూరు వైద్యశాలకు తరలించారు.