టీడీపీ ఆవిర్భావ దినోత్సవం: బొర్రా రాఘవేంద్ర యాదవ్ కుటుంబంతో కలిసి జెండా ఆవిష్కరణ

ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, టీడీపీ నాయకులు బొర్రా రాఘవేంద్ర యాదవ్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా, మాజీ వైస్ సర్పంచ్, మాజీ మండల బీసీ సెల్ అధ్యక్షులు బొర్రా బాలయ్య మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషిని కొనియాడారు. వారి స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్