పాపినేనిపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

మార్కాపురం జిల్లా పాపినేనిపల్లి గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పార్టీని బలోపేతం చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్