కార్మికుల చెమటలోనే దేశ ప్రగతి: డాక్టర్ మొర్రి. పిచ్చయ్య

అంతర్జాతీయ మే డే సందర్భంగా గిద్దలూరు పట్టణంలో యూటీఎఫ్-గిద్దలూరు డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి డాక్టర్ మొర్రి. పిచ్చయ్య మాట్లాడుతూ, కార్మికుల చెమట చుక్కలోనే దేశ ప్రగతి దాగి ఉందని, శ్రమ జీవుల సేవలే సమాజానికి నిజమైన బలమని తెలిపారు. మే డే శుభాకాంక్షలు తెలుపుతూ, చెమట చుక్కలతో ప్రపంచాన్ని నిర్మించే కార్మికుడికి గౌరవం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ రెడ్డి మే డే నినాదాలు వినిపించారు. ఈ సమావేశానికి జిల్లా మహిళా కార్యదర్శి మాధవి దేవి, ఆవులరాజు, జయచంద్రారెడ్డి, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్