కొమరోలు మండలంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని స్థానిక వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బావాపురం, ద్వారకచర్ల గ్రామాలలో రైతులకు పంటలు సాగు చేసే అంశం లో వ్యవసాయశాఖ అధికారి సూచనలు, సలహాలు ఇచ్చారు. పంటలకు రసాయన ఎరువులు తగ్గించి మంచి దిగుబడి సాధించేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు రాజశ్రీ వివరించి చెప్పారు. సందేహాలకు స్థానిక రైతు సేవ కేంద్రాలు సంప్రదించాలన్నారు.