మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో బుధవారం వర్చువల్ మహానాడు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి జెండా ఆవిష్కరణతో ప్రారంభమైంది. గిద్దలూరు మండలం నుండి టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నికల కోసం కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నామని తెలిపారు. ఆయన మాటలు కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపాయి.