కంభంలో దంచి కొట్టిన వర్షం

గురువారం రాత్రి మార్కాపురం జిల్లా కంభం, బేస్తవారిపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఈదురు గాలుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పగటిపూట 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు సాయంత్రం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్