మంతా తుఫాన్ కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలో 50 గంటలకు పైగా కురిసిన భారీ వర్షాలతో ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ సమీపంలోని సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం వాగు ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.