రాజధాని పేరున మూడుముక్కలాటాడారు

మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేశారని, ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసి ప్రజలను ఆందోళనకు గురిచేశారని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా తీర్మానించి కేంద్రానికి పంపిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్