పొదిలి మండలం జాఫ్లాపురంలో ఐదో తరగతి చదువుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు పాఠశాలకు వెళ్లకపోవడంతో కలకలం రేగింది. తల్లిదండ్రులు మందలించడంతో, వారు నిన్న పొదిలి లక్ష్మీనరసింహ స్వామి కొండకు వెళ్లి, ఏదైనా పని చేసి భోజనం పెట్టాలని కోరారు. రాత్రి అక్కడే నిద్రించి, ఉదయాన్నే ఆవులను మేతకు తీసుకెళ్లారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో, ఈరోజు వారిని ఇంటికి తీసుకువచ్చారు.