ప్రకాశం జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు, విద్యార్థులకు తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.