కంభం పోలీస్ స్టేషన్లో గురువారం ఆంధ్రజ్యోతి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై వైసిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసిపి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మహిళలను అగౌరవపరిచేలా కథనాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.