మహిళా దినోత్సవం సందర్భంగా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కాశిరెడ్డి కాలనీలో మంగళవారం సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, సైబర్, డిజిటల్ మోసాల బారిన పడకుండా మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ర్యాలీ కూడా నిర్వహించారు. గుడ్ హెల్త్ రమేశ్, ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.