బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం

మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో బుధవారం సాయంత్రం స్థానిక ఎస్సై కృష్ణ పావని విద్యార్థినిలకు బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండే వరకు బాలికలు వివాహం చేసుకోకూడదని, తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేస్తుంటే వెంటనే 112 లేదా 1098 నంబర్లకు సంప్రదించాలని, అప్పుడు పోలీసులు రక్షణ కల్పించి, వివాహాన్ని అడ్డుకుంటారని తెలిపారు. వివాహం చేసుకున్న వ్యక్తి, చేసినవారు కూడా నేరస్తులేనని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్