డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడ్డ బొలెరో

కనిగిరి మండలం నందన మారెళ్ళ గ్రామ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను కందుకూరులో దింపిన తర్వాత ఎర్రగొండపాలెం వెళ్తుండగా, బొలెరో వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో వాహన డ్రైవర్ యాకోబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్