జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ రేపు చలో విజయవాడ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం కనిగిరిలో పోస్టర్లను ఆవిష్కరించారు. కనిగిరి యూనియన్ అధ్యక్షుడు బాషా, కార్యదర్శి బుజ్జి, నాయకులు దుర్గా శ్రీనివాసరావు, చెన్నారావు, వాసు, సత్యంరెడ్డి, బాదుళ్ళ, అగస్టీన్, రంగారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.