మార్కాపురం జిల్లాలోని కనిగిరి కి డెమో రైలు

ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విజ్ఞప్తి మేరకు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంటూరు నుంచి గుండ్లకమ్మ మీదుగా కనిగిరికి ప్రతిరోజూ ఒక డెమో రైలు నడపాలని నిర్ణయించారు. ఈ రైలు గుంటూరులో ఉదయం 8:30కు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు కనిగిరికి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు కనిగిరి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు గుంటూరుకు చేరుతుంది. ఈ రైలు సదుపాయం కనిగిరి, పొదిలి, దర్శి ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానుంది. అతి త్వరలో ఈ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్