పీసీపల్లి మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

పీసీపల్లి మండలంలో శుక్రవారం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. భూ సర్వే ద్వారా గుర్తించిన రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసి, రాజముద్రతో పాస్ పుస్తకాలను రైతులకు అందించామని మంత్రి స్వామి, ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్