కంభం పట్టణంలో మున్సిపల్ అధికారులు శుక్రవారం శుభ్రత కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, నివాస కాలనీలలో చెత్తను తొలగించి, రోడ్లను క్లీన్ చేశారు. దుర్వాసనను నివారించేందుకు బ్లీచింగ్ పొడి చల్లారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.