మార్కాపురం జిల్లా కనిగిరిలోని కందుకూరు రోడ్డు పవిత్ర ఫంక్షన్ హాల్ వద్ద సోమవారం రాత్రి ఆకతాయిలు సిగరెట్ గడ్డి మీద వేయడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు మున్సిపల్ కమిషనర్కు సమాచారం అందించగా, ఆయన ఆదేశాలతో సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ప్రమాదం తప్పింది. ఈ సంఘటనతో నివాస గృహాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.