పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్టు

ప్రకాశం జిల్లా పామూరు మండలం వీరభద్రపురం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై ఒంగోలు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సుదర్శన్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10 వేల నగదు, నాలుగు మోటర్ సైకిళ్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పామూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్