ప్రకాశం జిల్లా పోలీసులు మంగళవారం అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, పామూరు మండలం కట్టకిందపల్లిలో జూదం స్థావరంపై టాస్క్ ఫోర్స్ సీఐ సుధాకర్ నేతృత్వంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 బైకులు, 5 మొబైల్ ఫోన్లు, రూ. 10,010 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.