కనిగిరి డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని డిఎస్పి సాయి యశ్వంత్ ఈశ్వర్ పోలీసు సిబ్బందికి సూచించారు. ఆదివారం డిఎస్పి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో, డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో క్రైమ్ రిపోర్టుపై ఆరా తీశారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించి, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.