పేకాట ఆడుతున్న నలుగురు అరెస్టు

మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం చోడవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం పేకాట ఆడుతున్న నలుగురిని స్థానిక ఎస్సై కృష్ణ పావని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కృష్ణ పావని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్