మార్కాపురం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం వెంగలాయపల్లి గ్రామంలో బుధవారం కాశమ్మ అనే మహిళ ఇంట్లో ఘరానా చోరీ జరిగింది. దొంగలు బీరువా పగలగొట్టి 3 తులాల బంగారం, రూ. 1.25 లక్షల నగదు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో దొంగల వేలిముద్రలు సేకరించారు. దొంగలను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.