కనిగిరి మండలం కృష్ణాపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంను బుధవారం సాయంత్రం మండల టిడిపి నేతలు నిర్వహించారు. మండల అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, ముచ్చుమూరి చెంచిరెడ్డి ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.