కనిగిరి మండలంలోని హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్‌ను గురువారం గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో రికార్డులు పరిశీలించిన ఆయన, పనితీరు సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ తనిఖీలో ప్రకాశం ఎస్పీ దామోదర్, డీఎస్పీ సాయి యశ్వంత్, సీఐ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.