ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ మణికంఠ తెలిపారు. తిమ్మారెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి, దాసరిపల్లి, హెచ్ఎం పాడు ప్రాంతాలలో మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని మణికంఠ విజ్ఞప్తి చేశారు.