ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని వీరరామాపురంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గురువారం గ్రామంలోని పాఠశాల వద్ద ఉన్న ఓ వ్యక్తిని పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. వెంటనే ఆ వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క మరో మారు మేకల మంద పైకి దూకి మేకలను కరిచింది. రైతులు కుక్కపై దాడి చేయడంతో కుక్క పొలాలలో పడి పరార్ అయింది. పిచ్చికుక్క స్వైర విహారంతో ప్రజలు హడలిపోతున్నారు.