కనిగిరి పరిసర ప్రాంతాలలో భారీ వర్షం

మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గవ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఈ మార్పు తీవ్ర ఉపశమనాన్ని ఇచ్చింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీయడంతో జనజీవనం ఆహ్లాదకరంగా మారింది. నియోజకవర్గవ్యాప్తంగా మోస్తరు వాన పడితే, వెలిగండ్ల మండలంలో మాత్రం వర్షం దంచికొట్టింది.

సంబంధిత పోస్ట్