ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆదివారం వెలిగండ్ల జడ్పిటిసి కార్యాలయంలో వైసీపీ ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ తరపున గెలిచిన ఎంపీటీసీలు, సర్పంచులు గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరలా విజయం సాధించి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీటీసీ, సర్పంచులు కలిసి జడ్పిటిసి గుంటక తిరుపత రెడ్డిని ఘనంగా సన్మానించారు.