మార్కాపురం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం అభినందనీయమని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. గురువారం ఇనిమెర్ల పంచాయతీ గ్రామ టీడీపీ అధ్యక్షుడు నల్లబోతుల వెంకటేశ్వర్లు రూ. 50 వేల నగదును ఉగ్రకు అందజేశారు. వెంకటేశ్వర్లును స్ఫూర్తిగా తీసుకొని దాతలు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ చర్య ఆసుపత్రి అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.