మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కనిగిరి పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మంగళవారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టారు. సమ్మె నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా నాయకులు పిసి. కేశవరావు మాట్లాడుతూ ఏడాదికాలంగా పోరాడుతున్న ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ చూపలేదన్నారు.