మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలో శనివారం 'బడిపిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ, మానవహారం చేపట్టారు. సుమారు 200 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో, డీఈవో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఆయన కోరారు.