అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం అమరావతి మైదానంలో స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేశారు. మాజీ ప్రభుత్వంలా కాకుండా పార్టీలకతీతంగా పింఛన్లు అందిస్తున్నామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శ్రీనివాస్ రెడ్డి, తిరుపాల్, ఫిరోజ్, రిజ్వాన్ పాల్గొన్నారు.