కనిగిరిలో కదం తొక్కిన కార్మిక సంఘాలు

మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో బుధవారం ఏఐటీయూసీ ప్రథమ మహాసభ సందర్భంగా, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పీవిఆర్ పార్క్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఎర్రజెండాలను చేతబూని సాగిన ఈ ర్యాలీలో ఏఐటీయూసీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఈ మహాసభ కార్మిక సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు ఉద్దేశించబడింది.

సంబంధిత పోస్ట్