స్వగ్రామానికి చేరుకున్న మహేంద్ర మృతదేహం

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను డీఎన్ఏ నివేదికల ఆధారంగా శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చోడవరం గ్రామానికి చెందిన పొదిలి మహేంద్ర మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్