గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలం మారెళ్ళ గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాధాకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద ఇర్లపాడు గ్రామానికి చెందిన రాధాకృష్ణ గంగమ్మ తిరునాళ్ల కు తిరిగి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్