మార్కాపురం జిల్లా కనిగిరి మండలం పేరంగుడిపల్లిలో నిర్మిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాల భవన నిర్మాణాలను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న తరగతి గదులు, ఇతర నిర్మాణాలను, ఏర్పాటు చేసే సౌకర్యాలను ఆయన పరిశీలించి, పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.