ఇఫ్తార్ విందులో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కనిగిరి పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా ప్రాంతంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం విందులో పాల్గొన్న ఆయన, మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్