మార్కాపురం జిల్లా పామూరులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోపాడు గ్రామానికి చెందిన ఆశీర్వాదం అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో యువకుడి కుడి కాలు శరీరం నుంచి విడిపోయింది. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.