పామూరు పట్టణంలోని వ్యాపారస్తు, ప్రజలు చెత్తను రోడ్డుపైన , సైడ్ కాలవలో వేయవద్దని పంచాయితీ కార్యదర్శి అరవింద విజ్ఞప్తి చేశారు. గురువారం పామూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆమె పర్యటించారు. సైడ్ కాలవలో చెత్త పేరుకుపోవడంతో అది గమనించి పంచాయితీ కార్మికుల చేత తీసివేయించారు. మాట్లాడుతూ ప్రతిరోజు తమ ఇంటి ముందుకు వచ్చే పంచాయతీ కార్మికులకు చెత్తను అందజేయాలని కోరారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.