పామూరు: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

పామూరు మండలం వగ్గంపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్ (28) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పామూరుకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే వివాహానంతరం గత రెండేళ్లుగా భార్యతో వేరుగా ఉంటున్నాడు. శనివారం రసూల్ “కనిగిరికి వెళ్తున్నాను” అని తల్లి మస్తాన్ బి కి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆచూకీ లేకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రావిగుంటపల్లి వద్ద ఓ చెట్టుకు అతని మృతదేహం వేలాడుతూ ఉంది.

సంబంధిత పోస్ట్