పామూరు: మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

పామూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య భర్తలు ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో కొద్దిరోజులుగా ఇరువురు దూరంగా ఉంటున్నారు. శనివారం ఇంటి నుంచి బయటికి వెళ్లి వస్తానని యువకుడు తిరిగి రాలేదు. సోమవారం రావిగుంటపల్లి వద్ద ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్