మార్కాపురం జిల్లా కనిగిరి మండల సీఐటీయూ కమిటీ సమావేశం మంగళవారం సుందరయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు పీసీ కేశవరావు మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేడే స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు.