రాష్ట్రవ్యాప్తంగా జరిగిన టీడీపీ మహానాడు విజయవంతమైందని, క్లస్టర్ స్థాయిలో దాదాపు 24 లక్షల మంది పాల్గొన్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఒంగోలు రాంనగర్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేలా స్త్రీ శక్తి పథకాన్ని ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు.