కనిగిరిలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మార్కాపురం జిల్లా కనిగిరి మండలంలోని చాకిరాలలో కందులు, శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం ప్రారంభించారు. రైతులు పండించిన కందులు, శనగలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అమ్ముకుని లబ్ధి పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్