హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీసీపల్లి మండల టీడీపీ సీనియర్ నాయకుడు వీరపనేని కేశవులు (52) మృతి చెందారు. గురువారం తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ సమీపంలో నీళ్లట్యాంకర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేశవులు పీసీపల్లి మండలం చినవరిమడుగు గ్రామానికి చెందినవారు మరియు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ, హైదరాబాదులో హోటల్, పీజీలు నిర్వహిస్తున్నారు.