నడికుడి నుంచి కనిగిరి వరకు నిర్మించిన రైల్వే లైన్ లో శుక్రవారం ట్రయల్ రన్ రైలు విజయవంతంగా పరుగులు తీసింది. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం నుంచి ప్రజలు, కూటమి నాయకులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఈ రైలు సేవలు విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.